కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగపరచుకోవాలి : జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 27 : నిరుపేదల అభివృద్ధి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకోవాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. జనసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 9 ఏండ్ల పరిపాలన సంక్షేమ పథకాలను వివరించుటకు జాతీయ మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి గురువారం మండలంలోని గానగుమార్లా తాండ, కానుగు భావి తాండ, హాన్మస్ పల్లి గ్రామాలలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో ఉన్న పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యం చేసిందో ప్రజలకు వివరించారు. కిసాన్ సమృద్ధి కేంద్రాల గురించి రైతులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పాత్లావత్ మన్య నాయక్, మాజీ ఎంపీపీ వీరయ్య, మోహన్ రెడ్డి, రమేష్ అయ్యగారు, రెడ్యానాయక్, శంకర్ నాయక్, సాయి లాల్ నాయక్, లక్ష్మణ్ నాయక్, రవీందర్ రెడ్డి, భగీరథ, మహేష్, రాందాస్ నాయక్, శ్రీశైలం, శ్రీను గౌడ్, వెంకటేష్, కుమార్, విజయ్, ప్రేమ్ కుమార్, మధు, సాయి ప్రభు, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *