వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు విరుస్తూ రానున్న ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త పనిచేయాలని వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పరిశీలకులు సోలాపూర్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ దేశ్ ముఖ్ సూచించారు. సోమవారం వికారాబాద్ మండల నాయకుల కార్యకర్తల సమావేశం రాఘవన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పరిశీలకులు విజయకుమార్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుందన్నారు. గ్రామాలకు మౌలిక వసతులు కల్పిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి ప్రభుత్వం తాము అభివృద్ధి చేస్తున్నామంటూ ప్రచారం నిర్వహించుకుని సొమ్ము చేసుకుంటున్నారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి గెలిపి లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పాండుగౌడ్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు నవీన్ కుమార్ పార్లమెంట్ కో కన్వీనర్ అమరేందర్ రెడ్డి బసవలింగం తదితరులు పాల్గొన్నారు.



