కేంద్రపాలితంగా హైదరాబాద్ మార్చేందుకు మోడీ కుట్ర

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : రాజకీయ కక్ష్యతోనే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ప్రజా సైన్యం పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వేములవాడ రాజ్ కుమార్ అగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బిజెపి మనుగడ కష్టమని నరేంద్ర మోడీ భావించి ఆ దిశగా అడుగులు వేస్తున్నాడని అన్నారు. ఈ మేరకు సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశాన్ని ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ తదితర చేతుల్లోకి పంపి కాషాయికరణ చేయడానికి ప్రయత్నిస్తుడని అన్నారు. అందులో భాగంగానే రాజకీయంగా బలంగా ఉన్న రాష్ట్రాలను బలహీన పర్చడానికి బిజెపి బలాన్ని మతం పేరుతో పెంచడంలో భాగంగానే మోడీ షాలు భారీ కుట్రకు తెర లేపారని అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో ఉన్న వనరులను అంబానీ, ఆదానిలకు దోచి పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మత తత్వ శక్తులకు బలోపేతం చేయడానికి నగరంలో అల్లర్లు సృష్టించడానికి శ్రమిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్న బిజెపి స్థానిక పార్టీలను ఆస్థిరపరచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండి కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భానుచందర్, సునీల్, డాక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *