- నల్లగొండ, భువనగిరిలో కాంగ్రెస్‌దే విజయం
- జగదీశ్ రెడ్డి అతిగా మాట్లాడితే ఊరుకునేది లేదు
- మీడియాతో మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : కేసీఆర్ బస్సు యాత్ర కాదు…. మోకాళ్ళ యాత్ర చేసినా నల్గొండ, భువనగిరిలలో బీఆర్‌ఎస్ పార్టీకి డిపాజిట్ రాదంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఓటమికి మించి పార్లమెంటులో ఓడిపోతు న్నారని మంత్రి అన్నారు బీఆర్‌ఎస్ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య వార్ ఏపాటితో అందరికీ తెలిసిందే. ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసుకుంటూ దుమ్మెత్తిపోస్తుంటారు. తాజాగా జగదీష్‌రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు.
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14సీట్లు గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం వ్నిడియాతో మాట్లాడుతూ…. మూడుసార్లు మూడు నాలుగు వేలతో గెలిచినాయన లీడర్ కాదని అన్నారు. మిర్యాలగూడలో మందు అమ్మిన కేసు ఇప్పటికీ ఉందని..మూడు మర్డర్ కేసుల్లో ఉన్నారన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి జగదీష్ రెడ్డి మరోసారి మాట్లాడితే దెబ్బలు తింటారని హెచ్చరించారు. తన స్థాయికి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం ఇదే చివరిసారి అంటూ జగదీష్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. జగదీష్ రెడ్డికి సుఖేందర్ రెడ్డి చాలన్నారు. నల్గొండ, భువనగిరి బీఆర్‌ఎస్ అభ్యర్థులు సర్పంచ్‌గా పనికిరారని విమర్శించారు. నల్గొండ అభ్యర్థి వాళ్ల సొంత ఊర్లో సర్పంచ్‌గా కూడా గెలవలేరన్నారు.





