కెసిఆర్‌ ‌మూర్ఖత్వంతో కష్టాల్లో రాష్ట్ర ప్రజలు

  • ఫామ్‌హౌస్‌కే పరిమితమైన సిఎం
  • మద్యం మీద ఉన్న సోయి అభివృద్ధి మీద లేదు
  • బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌కుమార్‌

‌జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : కేసీఆర్‌ ‌మూర్కత్వం వలన రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారని వారికి భరోసా ఇవ్వడానికే తాము ప్రజల వద్దకు వొస్తున్నామని రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌ అన్నారు. కేసీఆర్‌ ‌మద్యం సేవించి పాలన మీద సోయి లేకుండా పోయిందన్నారు. దళితబంధు పేరుతో టీఆర్‌ఎస్‌ ‌నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. కొండగట్టు యాక్సిడెంట్‌లో చనిపోయిన వారిని ఇంత వరకు కేసీఆర్‌ ‌పరామర్శించలేదని, పేదోళ్లు చనిపోతే కేసీఆర్‌ ‌మాట్లాడడన్నారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక గ్రామాలలో నీళ్లు లేవు కానీ బెల్టు షాపులలో మధ్యం ఏరులై పారుతుందని బిజెపి జిల్లా ధ్యక్షులు ఆరుట్ల దశమ్తతరెడ్డి అన్నారు.

ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ ‌డివిజన్‌ ‌కేంద్రంలోని చత్రపతి శివాజీ చౌక్‌ ‌వద్ద కార్నర్‌ ‌సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ము్య•అతిధిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌హాజరై మాట్లాడుతూ…సీఎంకేసీఆర్‌ ఎన్నికల ముందు అనేక హామిలిచ్చి ఎన్నికలలో గెలుపొందాక రాష్ట్ర సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కొరోనా టీకా ఇచ్చి అనేక మంది ప్రాణాలను కాపాడటం జరిగిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని మాయమాటలు చెప్పిన కేసీఆర్‌ ‌తన కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలిచ్చి నెలకు రూ. 24 లక్షల జీతం తీసుకుంటున్నారన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ‌నియోజకవర్గాన్ని ఇద్దరు డిప్యూటీ సీఎంలున్నా కనీసం వంద పడకల హాస్పిటల్‌, ‌డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయలేకపోయారన్నారు.

బిజెపి అధకారంలోకి వొచ్చిన వెంటనే ఒక్క సంవత్సరంలోనే పేదలందరికి ఇండ్లు, ఆయుశ్మాన్‌భవ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందజేస్తామన్నారు. పేదోళ్ల గుర్తు కమలం పువ్వు, పెద్దోళ్ల గుర్తు కారు గుర్తు అని చెప్పడానికే ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లాధ్యక్షులు ఆరుట్ల దశమంతరెడ్డి, నాయకులు  బేజాబి బీరప్ప, ఉడుగుల రమేస్‌, ‌మాదాసు వెంకటేష్‌, ‌గుండె విజయరామారావు, సౌడ రమేష్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *