సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: సిద్దిపేట అర్బన్ మండలంలోని రెండవ వార్డులో కేసీఆర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోగురువారం ఉపాధ్యాయులు, విద్యార్థులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలు తెచ్చి బతుకమ్మను, గౌరమ్మలు పేర్చి పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దారం ఉమాదేవి, ఉపాధ్యాయులు భాస్కర్, యాదగిరి, వంగ వెంకటరాంరెడ్డి, శ్రీనివాస్, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, చంద్రయ్య, స్వరూప రాణి పాల్గొన్నారు.
కెసిఆర్ నగర్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు




