వికారాబాద్ జిల్లాలో 92000 మంది విద్యార్థులకు సీఎం అల్పాహారం.
మన ఊరు మనబడి పథకంతో స్వరూపం మారిపోయిన పాఠశాలలు.
విద్యా హబ్బుగా తెలంగాణ అవతరిస్తుంది..
మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి.
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: కెసిఆర్ ది పేదల పక్షం ప్రతి పథకం పేదలకు అంకితం అని ఎవరు ఎన్ని మాట్లాడినా వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే వస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.వికారాబాద్ లోని శివారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్, ఎంపీపీ చంద్రకళ తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగారాష్ట్రంలో 27,147 పాఠశాలల్లో సీఎం అల్పాహార పథకం అమలు జరుగుతుండగా,23 లక్షల మంది విద్యార్థులకు అల్పాహార పథకం తో మేలవుతుందని చెప్పారు. వికారాబాద్ జిల్లాలో 1051 పాఠశాలలోని 92000 మంది విద్యార్థులకు సీఎం అల్పాహారం అందనుందన్నారు. మన ఊరు మనబడి పథకంతో పాఠశాలల స్వరూపం మారిపోయి
విద్యా హబ్బుగా తెలంగాణ అవతరిస్తుందని మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు వికారాబాద్ జిల్లాలో 4 పాఠశాలల్లో 602 మంది విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభం కావడం జరిగిందన్నారు. గతంలో పాలకుల నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను సీఎం కేసీఆర్ ప్రక్షాళన చేస్తున్నారు.మన ఊరు మనబడి కార్యక్రమంలో వికారాబాద్ జిల్లాలోని 371 పాఠశాలలను 109 కోట్లతో ఆధునికరిస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకం గతంలో 9 తరగతి వరకు ఉండేది. ఇప్పటినుండి 9,10 తరగతుల విద్యార్థులకు కూడా సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నామని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ విద్యార్థులకు సరైన విధంగా భోజనం ఉన్నప్పుడే మేధాశక్తి చురుకుగా పనిచేస్తుందని తెలిపారు. నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ ఉదయం పూట సరైన విధంగా ఆహారం తీసుకోవాలన్నారు అదేవిధంగా ఆహారం తీసుకుంటే చక్కటి శక్తి లభిస్తుందని తెలిపారు రాత్రిపూట పడుకునే సమయంలో మామూలుగా ఆహారం తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం నాణ్యమైన వసతులను కల్పిస్తూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తూ వారి అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుందని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు.




