కెసిఆర్ కు అధికారమిస్తే గొస పడతాం ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 15 : బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయ మాటలకు మోసపోయి వారికి ఓటు వేస్తే గోసపడతామని బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాడుగుల మండలంలోని దొడ్లపాడు, గుడి తండా, నాగిళ్ల, ఫిరోజ్ నగర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ పాలనలో కరెంట్ బిల్లులు ఇంటి పన్నులు నల్లా బిల్లులు విపరీతంగా పెంచారన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చదువుకున్న యువత ఉద్యోగాలు లేక రోడ్ల పైన తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో హామీలు ఇస్తారని గెలిచినాక అమలు చేయరని అన్నారు. దళిత బంధు, పెన్షన్లు, బీసీ బందు, రేషన్ కార్డులు, బిఆర్ఎస్ కార్యకర్తలకే దక్కుతున్నాయన్నారు. గత 40 సంవత్సరాలుగా ఒకే పార్టీ ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకుని తన జీవితం మొత్తం కల్వకుర్తి ప్రజల సేవకే అంకితం చేశానన్నారు. ఒక్క చివరి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కల్వకుర్తి రూపురేఖలను మారుస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *