- బిజెపికి మాత్రమే అది సాధ్యం
- గజ్వెల్‌లో వోటమి భయంతో కామారెడ్డికి పరార్
- సంగారెడ్డిలో మీడియాతో బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్
సంగారెడ్డి, ప్రజాతంత్ర, అగస్ట్ 30 : కెసిఆర్ కుటుంబ పాలనను తుదముట్టించే పార్టీ బిజెపి మాత్రమేనని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ప్రజలు గమనించాలని ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం సంగారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో ఈటల వి•డియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గజ్వేల్ ప్రజలు కేసీఆర్‌ను నమ్మి వోటేస్తే..ప్రజల భూములు గుంజుకుంటున్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని అన్నారు. కేసీఆర్‌ని గజ్వేల్ ప్రజలు గెలిపించవద్దని కోరుతున్నానని అన్నారు. గజ్వేల్ నుంచి తాను పోటీ చేస్తానని గతంలోనే చెప్పానని, గజ్వేల్ ప్రజలు ఈసారి కేసీఆర్‌కు వోటు వేయం అంటున్నారని, గజ్వేల్ నుంచి ఒడిపోతామన్న భయంతోనే కేసీఆర్ కామారెడ్డికి పారిపోయారని ఈటల అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు 30 నుంచి 40 శాతం మందికి టికెట్ రాదని ప్రచారం జరిగిందని, కానీ భయపడి ఒకేసారి 115 మంది టికెట్లు ప్రకటించారన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో నేరుగా కలెక్టర్లే డబ్బులు డ్రా చేసి దావత్‌లు చేశారని, కేసీఆర్ ఇచ్చే హావి•లు బోలెడు కానీ ఒక్కటీ అమలు కాదన్నారు.
బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 19 మందిలో 12 మంది బీఆర్‌ఎస్ లోకి గుంజుకున్నారని ఆయన విమర్శించారు. కుక్కల్లాగా మొరిగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పిల్లిల్లా చేశామని ఓ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అంటున్నారు. కాంగ్రెస్ వాళ్లను ఏమనకండి వాళ్లు మనవాళ్లే అని ఇంకో ఎమ్మెల్యే అంటున్నారు. వాళ్లు మన కోవర్టులే. మనమే గెలిపించి మన పార్టీలోకి తీసుకోస్తామంటున్నారు. కుటుంబ పాలన వద్దంటే బీజేపీకి వోటేయండని ఈటల పిలుపునిచ్చారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపే సత్తా బిజెపికి మాత్రమే ఉందన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే రేపు మనకి శుభోదయం అన్నారు. బీజేపీకి గ్రాఫ్ బాగా ఉందని 119 నియోజకవర్గాల్లో పర్యటించిన తమ ఎమ్మెల్యేలు చెప్పారని, సమన్వయం ఉంటే ఇంకా ముందుకు వెళ్లొచ్చని చెప్పారని ఈటల వ్యాఖ్యానించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఈటల పాల్గొనడం జరిగింది.
ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఏనాడూ ఆయన నియోజకవర్గం గజ్వేల్ ప్రజలకు ముఖం చూపించలేదు. వోట్లు వేసిన పాపానికి మా ఎమ్మెల్యేను చూశాం అనే తృప్తి లేదని వారు బాధ పడుతున్నా పట్టింపు లేదన్నారు. దిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే అన్నట్టు..వి•రు సీఎం కావాలంటే వోట్లు వేసి పంపించింది గజ్వేల్ వారు. కానీ వారి భూములు అన్నీ లాక్కున్నారు. పేదవాల్లకు ఇచ్చిన అసైన్డ్ భూములు గుంజుకొని పెద్దలకు కట్టబెట్టారు. కెసిఆర్ దళిత పేదలకు మూడు ఎకరాలు ఇస్తా అని ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదు కానీ.. ఎప్పుడో మాకు ఇచ్చిన కోట్ల రూపాయల భూములను లాక్కున్నారని ప్రజలు ఏడుస్తున్నారు. అందుకే కెసిఆర్‌ను ఎట్టిపరిస్థితుల్లో గెలిపించవద్దని వారు నిర్ణయించుకున్నారు. అక్కడో ఇక్కడో ఎందుకు గజ్వేల్‌లో పోటీ చేస్తా అని తాను ఛాలెంజ్ చేసిన విషయాన్ని ఈటల ఈ సందర్భంగా గుర్తు చేశారు. సర్వే సంస్థ వెళ్ళినా ఈ సారి కెసిఆర్‌కి వోటు వేయం అని చెప్తున్నారు.
ఎమ్మెల్యేల వి•ద వ్యతిరేకత కాదు అసలు వ్యతిరేకత కెసిఆర్ మీదే ఉందన్నారు. అందుకే కెసిఆర్ భయపడి గజ్వేల్‌లో పోటీ చెయ్యడం లేదన్నారు. ఇది ఒక్కటి చాలు భయపడ్డారు అనడానికని ఈటల ఎద్దేవా చేశారు. అన్ని సీట్లు ఒకేసారి ప్రకటించడం కెసిఆర్ బలం కాదు బలహీనత అన్నారు. వారి ఎమ్మెల్యేలు లంచాలు తీసుకున్నారని స్వయంగా కెసిఆర్ చెప్పారు. 30 శాతం టికెట్ల మారతాయని ఆయనే చెప్పారు. కానీ ఒక వేళ టికెట్ మారిస్తే వేరే పార్టీకి పోతారు అనే భయంతో అందరికీ ఇచ్చారన్నారు. కట్టు తప్పింది, పట్టు తప్పింది అనే భయంతో సీట్లను ప్రకటించారన్నారు. చాలా మంది ప్రజల చేత తిరస్కరించిన వారికి టికెట్స్ ఇచ్చారని, వారు గెలిచేది లేదని, ఉపాసం ఉండి అటుకులు బుక్కి పార్టీనీ నడిపిన అని చెప్పిన కెసిఆర్‌కి అతి తక్కువ కాలంలో ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని ఈటల విమర్శించారు. ఆ డబ్బు ధైర్యంతో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. దశాబ్ది ఉత్సవాల కోసం 200 కోట్లు ఖర్చుపెట్టారు. అవన్నీ ప్రజల పైసలు. ఎవడబ్బ సొమ్మని వాటితో దావత్ ఇచ్చారని ఈటల నిలదీసారు. కెసిఆర్ ఆ నిమిషానికి గట్టెక్కడనికి ఇచ్చే హావి•లే తప్ప అవి అమలవుతాయనే సోయి లేదన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇయ్యలే, 57 సంవత్సరాల పెన్షన్ ఇయ్యలే, నిరుద్యోగ భృతి ఇయ్యలే, రుణమాఫీ డబ్బులు వడ్డీకి సరిపోవట్లే, హావి•లు బోలెడు అమలు శూన్యంగా ఉందన్నారు. జీతాలు సరిగ్గా ఇవ్వలేక పోతున్న వారు ఎలా హావి•లు తీర్చగలుగుతారని ఈటల ప్రశ్నించారు. సర్పంచ్‌లు, కాంట్రాక్టర్స్ బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆర్థిక వ్యవస్థ అధోగతిపాలయిందని, కెసిఆర్ మాటలకు మోసపోతే గొసపడతామని ఈటల హెచ్చరించారు. రేపు కాంగ్రెస్ లో గెలిచిన వారంతా కెసిఆర్ పంచన చేరుతారని, గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, బిఆర్‌ఎస్ దారి పట్టారని, ఇప్పుడు కూడా అంతేనని, కలబడి నిలబడగలిగేది ఒక్క బీజేపీ మాత్రమేనని ఈటల స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్‌కు వోటు వేస్తే ఒక కుటుంబం బాగుపడుతుందని, మన కుటుంబాలు బాగుపడాలంటే బీజేపీకి వోటు వేయండని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వంను గద్దె దించితెనే తెలంగాణకు శుభోదయమని, దీనికి నాయకత్వం వహించడానికి బీజేపీ సిద్దంగా ఉందని అన్నారు. కొన్ని పేపర్లు, ఛానళ్ళు లేని పోని హైక్‌ను చూపిస్తున్నాయని, వఱ ఐక్యతతో ముందుకు పోతామని, ప్రజల ఆశీర్వాదం పొందుతామని ఈటల రాజేందర్ అన్నారు.




