- పాలమూరు నుంచే సమరభేరీ
- లిక్కర్, అప్పుల తెలంగాణగా మార్చిన కెసిఆర్..పాలమూరు ర్యాలీలో మండిపడ్డ కిషన్ రెడ్డి
- నియంత పాలన అంతమయ్యే వరకు నిద్రపోమన్న డికె అరుణ
- తెలంగాణ ద్రోహి సీఎం కేసీఆర్…బంగారు తెలంగాణ కాలేదు కేసీఆర్ బంగారు కుటుంబమైంది
- కాంగ్రెస్ ఎమ్‌ఐఎమ్ బి ఆర్ ఎస్ లు ఒకే గూటి పక్షులు
- తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలమూరు కీలకం..తెలంగాణలో మార్పు రావాలి
- వచ్చి ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించాలి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, జులై 31 : తెలంగాణ రాష్ట్ర ప్రజలను నమ్మించి మభ్యపెట్టి మోసగించి వంచించిన తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తారు. సోమవారం బిజెపి మహా ర్యాలీ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ కూడలి వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోయిందని కేవలం రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలతో మభ్యపెడుతూ మోసం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్‌ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధన దిశగా పనిచేస్తున్నామని ప్రజలకు అబద్ధాలు చెప్పారని బంగారు తెలంగాణ కాలేదు కానీ బంగారు కెసిఆర్ కుటుంబం మాత్రం అయ్యిందన్నారు. పేద ప్రజలకు రెండు పడక గదుల నిర్మాణం చేపట్టి పేద ప్రజల ఇల్లు కల నెరవేరుస్తామని చెప్పి పేద వారి గూడు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం 11 ఎకరాల స్థలంలో విలాసవంతమైన రాజ భవనాన్ని తలపించేలా జీవనాన్ని గడుపుతున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని కోరుకున్న ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరాశ మిగిల్చారన్నారు. కేజీ టు పీజీ విద్య అని చెప్పి మోసం చేశారన్నారు. రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తానని ఇప్పటివరకు చేయలేదన్నారు. బ్యాంకులలో రైతుల పేరిట అప్పు వడ్డీ రూపంలో మారి రైతులకు శాపంగా మారిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు చీమకుట్టినట్టుగా లేదన్నారు. కేవలం ప్రాజెక్టుల పేరుతో కమిషన్ల రూపంలో డబ్బులను దోచుకుంటున్నారన్నారు. ప్రధానమంత్రి మోదీ భారత దేశ వ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్లను పేదలకు నిర్మించి ఇచ్చారన్నారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి రహదారులను విస్తరణ నిర్మాణాలకు చేస్తున్నారన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 9 సంవత్సరాల పై పాలించి ఇప్పటివరకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అన్నారు. గత మూడు సంవత్సరాల పై నుండి పేదలకు ఉచితంగా కేంద్ర ప్రభుత్వమే రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో యుపిఎస్ కమిషన్ పరీక్షల పేపర్ పత్రాలు లీకేజ్ విషయంలో ఇప్పటివరకు అతిగతి లేదన్నారు. కేజీల తో 30 లక్షల నిరుద్యోగులు జీవితాల్లో నిప్పు మిగిల్చారన్నారు. నిరుద్యోగ భృతి అని చెప్పి ఇప్పటివరకు దాని ఊసే లేదన్నారు.
బందుల పేరుతో కుల రాజకీయాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా చైతన్యవంతులు అవ్వాలని ఈ రాష్ట్రంలో మార్పు రావాలని కోరారు. నిరుద్యోగ యువత కూడా ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు వేల సంఖ్యలో ఖాలీ ఉన్నా కానీ ఇప్పటివరకు ఒక్క డీఎస్సీ ని కూడా వేయలేదు అన్నారు. తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్ ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో పాలమూరు చాలా కీలకమని అన్నారు. పాలమూరు నుండి నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎంపీగా ఆశీర్వదించి పంపిస్తే.. పాలమూరును పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రె,• ఎమ్‌ఐ ఎమ్, బిఆర్‌ఎస్ పార్టీలు మూడు ఒకే గూటికి చెందిన పక్షులని వీటిలో ఎవరికి వోటు వేసిన మూడు ఒకటేనని ప్రజలు గుర్తించుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరుచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దే దించేందుకు సమాయత్తం కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి, రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని బీజేపీ మహా ర్యాలీ నిర్వహించింది. అనంతరం క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ , మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తల్లోజు ఆచారీ, ఉమ్మడి జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ… తెలంగాణాలోని నియంత పాలన అంతం అయ్యే దాకా బీజేపీ నిద్రపోదన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఈ ప్రభుత్వం ఇచ్చేదాకా వదలమని.. లేదంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక తామే ఇస్తామని హా ఇచ్చారు. మందిని మోసం చేసే విధానం సీఎం కేసీఆర్‌కు వచ్చినంతగా ఎవ్వరికీ సాధ్యం కాదన్నారు. సీఎం కేసీఆర్ సోయి తప్పి ఫామ్లో పండుకున్నారని వ్యాఖ్యలు చేశారు. టూబీహెచ్‌కే, రుణమాఫీ, ఉపాధి ఇలా ఎన్నో హాలు ఇచ్చారని.. ఏవైనా హాలు నెరవేర్చారా అని బీజేపీ నేత ప్రశ్నించారు.మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నారని…
ఈ మోసగాని మాటలను ప్రతీ ఒక్కరికీ తెలిసేలా బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన పేరున అప్పులు తెచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు జేబులు నింపుకున్నారని ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా.. మిగులు బ్జడెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారన్నారు. సీఎం కేసీఆర్‌లానే.. ఆ పార్టీ నేతలు కింది స్థాయి నాయకులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తున్నారని… ఇక్కడ అభివృద్ధి పేరున కషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. జరిగిన అభివృద్ధి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగిందన్నారు. ఇక్కడ నడఊ••ర్లో ఉన్న కలెక్టరేట్‌ను కూల్చి.. ఆయన ఇంటికి దగ్గర్లో కట్టించుకున్నారన్నారు. హెరిటేజ్ బిల్డింగ్‌ను కూల్చి ఏం చేస్తున్నారో చెప్పాలని… జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.




