కెటిఆర్‌లో అధికారం పోయిందన్న బాధ

ప్రభుత్వంపై విమర్శలకు మంత్రి సీతక్క కౌంటర్‌
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అలవిగానీ హావిూలు ఇచ్చారంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోయేసరికి తట్టుకోలేక ఎకసక్కెపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా అధికారంలో ఏం వెలగబెట్టారో ప్రజలు చూస్తున్నారని అన్నారు.  బుధవారం ఆమె కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చేసిన వ్యాఖలపై విూడియాతో మాట్లాడుతూ..బీఆర్‌ఎస్‌ నాయకులకు అంత తొందర పాటు వద్దన్నారు. అధికారం పోయిందన్న బాధ కేటీఆర్‌ను వెంటాడుతుందని అన్నారు.

తాము ఇస్తా అన్న దానికి బీఆర్‌ఎస్‌ వాళ్ళు పెంచి చెప్పారు కదా అని ప్రశ్నించారు. ఇచ్చిన ప్రతి హావిూ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఒక్కో హావిూ అమలు చేసుకుంటూ వొస్తున్నామన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామన్నారు. కాంగ్రెస్‌ గెలిచిందని ప్రజలంతా సంతోష పడుతున్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. దీనిని కూడా తట్టుకోలేకపోతున్నారని అన్నారు. అప్పుల గురించి మాట్లాడుతూ…లెక్కలు ఉన్నాయని అంటున్నారని, లెక్కలు కాదు దుబారా గురించి తాము లెక్కలు తీస్తున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *