కెఎల్ఆర్ సమక్షంలో నేదునూరు గ్రామ మాజీ సర్పంచ్

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 17 : వైస్ ఎంపీపీ గంగుల శమంతా ప్రభాకర్ రెడ్డి,జిల్లా మైనారిటీ జనరల్ సెక్రటరీ యండి. అఫ్జల్ బేగ్ ల ఆధ్వర్యంలో నేదునూరు గ్రామ మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దుల మల్లయ్య యాదవ్, బిజెపి సీనియర్ నాయకులు గంగుల నిఖిత రాకేష్ రెడ్డి లు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెఎల్ఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,బిఆర్ఎస్,బిజెపి పార్టీల అవినీతి పాలనను అరికట్టడానికి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి,మాజీ జడ్పి ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి,ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి విస్లావత్ ఆంజనేయులు నాయక్,మండల్ ప్రధాన కార్యదర్శి వరికుప్పల బాబు, సీనియర్ నాయకులు ఇంద్రకంటి రాకేష్ గౌడ్,వార్డు సభ్యులు ఎగిరిశెట్టి నర్సింహా, గడిగే రాములు గౌడ్,సిల్వేరు పరమేశ్వర్,అంకగాళ్ల దర్శన్,యండి.శైబాజ్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *