కృష్ణాపై విజయం సాధించాం మాజీ మంత్రి కెటిఆర్‌ ట్వీట్‌

ప్రజాతంత్ర,ఇంటర్నెట్‌ డెస్క్‌,ఫిబ్రవరి 12 : కృష్టానది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించ బోమంటూ సోమవారం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వేళ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. బీఆర్‌ఎస్‌ తలపెట్టిన ‘ఛలో నల్గొండ ఎఫెక్ట్‌!’ కారణంగా అధికార పార్టీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతుందని వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌ సాధించిన తొలి విజయం ఇదని ఆయన అభివర్ణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *