కుల్కచర్ల మాజీ సర్పంచి కాంగ్రెస్ పార్టీలో చేరిక 

 కుల్కచర్ల, ప్రజాతంత్ర నవంబర్ 22: కుల్కచర్ల మాజీ సర్పంచి జొగు వెంకటయ్య గౌడ్ బుధవారం నాడు డిసిసి జిల్లా ఉపాధ్యక్షుడు బొలుసాని భీంరెడ్డి, బ్లాక్ బి అధ్యక్షుడు భారత్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతనితో పాటు మండల కేంద్రంలోని అల్లం వెంకటేష్,వేపూరి నర్సింలు,రసూల్ నాయక్ లకు కాంగ్రెస్ పార్టీ కండువా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు.. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు అడ్వికెట్ బాలముకుందం, కనకం మొగులయ్య, పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు,కుమ్మరి స్వామి, వెంకటేశం, రాంరెడ్డి,తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *