ఇటీవల, బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కులాల సర్వే, 2023 యొక్క ఫలి తాలను విడుదల చేసి ంది, ఇది ఇతర వెను కబడిన తరగతులు మరియు అత్యంత వెనుకబడిన తరగతులు కలిసి రాష్ట్ర మొత్తం జనాభాలో 63% ఉన్నట్లు వెల్లడించింది. బీహార్ లో నిర్వహించిన కులగణన మతాన్ని చీల్చేది గా ఉందని ప్రధాని పరోక్షంగా వెల్లడి ంచారు, అలాగే కులగణన అమలు చేయకుండా చేయాలని సుప్రీంకోర్టు లో కేసులు దాఖలు చేశారు. అమ్మా పెట్టదు అడుక్కు తినమని చెప్పదు అన్నట్లుంది బీజేపీ పోకడ. మరోవైపు తెలంగాణాలో అరవై శాతం ఉన్న బీసీలకు కేవలం 23 సీట్లు ఇచ్చి తన కుటిలత్వాన్ని ప్రదర్శించారు కేసీఆర్.. దేశంలోని రాజస్థాన్ లో కులగణన ప్రక్రియ ప్రారం భమైనది. అన్ని రాష్ట్రాలలోబీసీ కుల గణన జరగాల్సిందే బీసీ ఉద్యమ కారులు, దళిత ప్రజాతంత్ర వాదులు, వామపక్షాలు, మేధావులు డిమాండ్ చేస్తున్న కేంద్రం పట్టించుకోక పోవడం దురదృష్టకరం. కుల గణన అనేది జరగితే ఎవరు ఎంత శాతంఉన్నారని తెలుస్తు ంది. కులగణన చేపట్టక కేవలం ఎనిమిది శాతం ఉన్న ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించడం వలన వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.
జనాభాలో 57 శాతం ఉన్న వెనుకబడిన తరగతులకు కేవలం 27 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఓబీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి పోయారు. చట్టసభల్లోనే కాదు గ్రామ మండల స్థాయి ప్రాతినిధ్యం లేని కులాలు అరవై శాతం వెనుకబడిన తరగతులలో ఉన్నాయి. ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గా ఓబీసీ వాటా భవిష్యత్తు ఏందో తేల్చాలి. బీసీ కుల గణన చేపట్టకుంటే కేంద్రంలోని బీజేపీ సర్కారుతో తాడోపేడో తేల్చు కోవాల్సిన సమయం ఆసన్నమయిందని మేధావులు హెచ్చరిస్తున్నారు. బీజేపీ సర్కార్ ఇదే నిర్లక్ష్యాన్ని కొన సాగిస్తే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి వోట్లు వేయ బోమని స్పష్టంచేశారు.రిజర్వేషన్లను ఎత్తేసేలా కేంద్రం వైఖరి ఉంటున్నది. బీసీ కుల గణనను చట్టం అనుమతి స్తుందని, కోర్టులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి, బీసీ జనాభా లెక్కలు లేకుండా దేశంలోని కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు ఎలా చేస్తారు. ‘కులాల లెక్కలు తేల్చితే విద్యావంతులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారో తేలుతుంది.
దేశ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం కూడా తెలుస్తుంది. కుల గణన జరిగితే రిజర్వేషన్లు పెంచాలని బీసీల నుంచి డిమాండ్ వస్తుందన్న ఉద్దే శంతోనే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆ పని చేయడం లేదు. తెలంగాణ, బీహార్, మహారాష్ట్ర, ఒడిశా, జార?ండ్, తమిళనాడు ముఖ్యమంత్రులు కులాల లెక్కలు తీయాలని కోరారు. అసెంబ్లీల్లో తీర్మానాలు సైతం చేశారు. ప్రజలంతా వారి కుల లెక్కలు తీయా లని కోరుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది. రూపాయి ఖర్చు లేకుండా కుల గణన చేసే అవకాశం ఉన్నా ఎందుకు చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. బీసీ జనాభా లెక్కలు బయటకొస్తేనే దోపిడీ చేసేవారికి అడ్డుకట్ట పడుతుంది. అందుకే లెక్కలు బయటకు రాకుండా ఆ వర్గాలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ‘అందరూ సమిష్టిగా కేంద్రం మెడలు వంచాలి. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. బీసీల పోరాటానికి జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలవాలి. దేశంలో ఓబీసీల్లో 983 కులాలకు ఐదేండ్లుగా ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రయోజనాలు అందట్లేదు. ప్రధాని మోదీ నేతృత్వంలో చేతగాని పాలన సాగుతు న్నది, వ్యవస్థలన్నీ పతనమై పోయాయి, నిరుద్యోగం 8.4 శాతం పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు దివాలా తీసేలా చేస్తున్నారు.ఇన్సూరెన్స్, రైల్వే, కమ్యూనికేషన్, చివరికి ఇస్రో, హెచ్‌ఏఎల్ ప్రవేటు పరం చేస్తున్నారు.
ఆయన ఏదో చేస్తున్నారన్న భ్రమ నుంచి ప్రజలు బయట పడాలి. బీసీల్లోని అన్ని కులాలు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా బలపడాలి. దేశ జనాభాలో 57% బీసీలే ఉన్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం రిజర్వేషన్లు ఇవ్వకపోవడంబాధాకరము. కులాల లెక్కలు తీయకపోతే బీజేపీగద్దె దిగిపో వాల్సిందే. ఇప్పటివరకు వారి వాటాతోపాటు బీసీలకు వచ్చే వాటాను కూడా అనుభవిస్తున్నారు. కులం పేరుతో వివక్షకు గురైన వర్గాల వారికి సమ ప్రాతినిధ్యం దక్కించడం కోసమే రిజర్వేషన్ల వ్యవస్థ’’ అని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4) ,16(4) లలో స్పష్టంగా పేర్కొనబడింది. ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వా ల్సినవి సంక్షేమ పథకాలు మాత్రమేనని, ఆర్థిక ప్రాతిప దికన రిజర్వేషన్లు ఈబీసీ వర్గాలకు ఎక్కడ నుండి వచ్చింది. రిజర్వేషన్ కు ప్రాతిపదిక కులం (సామాజిక వెనుకబాటు) మాత్రమే, కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటి నుంచి అంతా తారుమారు అవుతుంది.
మండల్ కమీషన్ రిపోర్ట్ ప్రకారం ఓబీసీ ల జనాభా 54% , అగ్రకులాల జనాభా ఎంత అనేది తెలియకుండా వారికి 10 శాతం రిజర్వేషన్లా? అసలు ఏ లెక్కల ప్రకారం 10% కేటాయించారు అనే దానిపై చర్చ జరిగినట్లు లేదు. తీర్పు వెలువరించే ముందు ఓసి ల జనాభాను సుప్రీం శాస్త్రీయ లెక్కలు లేవు పరిగ ణనలోకి తీసుకున్నట్లు లేదు. రిజర్వేషన్లు 50% దాటొచ్చు అన్న సుప్రీం తీర్పు వెనుకబడిన తర గతులు అనుకూలంగా మలచుకుని జనాభా దామాషా ప్రకారం ఓబీసీ లకు 54%రిజర్వేషన్ల కోసం పోరాడాలి.
సమగ్రంగా, శాస్త్రీయంగా అన్ని కులాల లెక్కలు తీయాలి, వేరే అంశాలు పక్కన పెట్టి జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలి. మండల్ మహనీయుడే మనకు మార్గదర్శి, ఇదే అంశంపై దేశవ్యాప్త చర్చ జరగాలి. రిజర్వేషన్లు 50% దాటొచ్చు అన్న సుప్రీం తీర్పు ప్రకారం ఓబీసీ లకు 54% రిజర్వేషన్లు అమలు చేయాలి లేదా సమగ్రమైన, శాస్త్రీయమైన కులగణన ద్వారా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయి ంచాలి.
బీసీ బిల్లును పార్లమెంట్లో అడ్డుకొని బీసీలకు దక్కకుండా బిజెపి పార్టీ చేసినది, బిజెపి పార్టీ వీపి సింగ్ ప్రధానమంత్రిని పదవిని కూడా కూల్చివేసినది, అంటే బిజెపి ప్రభుత్వం భారత స్వాతంత్య్ర పోరాటం నుండి ఆర్య బ్రాహ్మణిజం మను వాదులు మత ఉన్మాదులు దేశద్రోహులు ఆర్‌ఎస్‌ఎస్ ఈనాటి బీజేపీ ప్రభుత్వం బీసీలను సర్వనాశనం చేస్తున్నది, మన దేశాన్ని సర్వనాశనం చేస్తున్నది.బీసీ కుల గణనను చేయకుండా మొత్తం బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీల చట్టసభలలోని ఎంపీల ఎమ్మెల్యే సీట్లు అన్ని బిజెపి ప్రభుత్వం పార్టీ లోని అగ్రవర్గాలు అగ్రకులాలు అనుభవిస్తున్నారు, ఆనాటి నుండి ఈనాటి దాకా బ్రాహ్మణిజం మనువాదులు మత ఉన్మాదులైనటువంటి బిజెపి, పార్టీలు ఎదగనీ యకుండా చేస్తూ మతం పేరుతో బహు జనులను వాడుకుంటున్నాయి. భారత స్వాతంత్య్ర పోరాటం నుండి ఆర్య బ్రాహ్మణిజం మను వాదులు మత ఉన్మాదులు దేశద్రోహులు ఆర్‌ఎస్‌ఎస్ ఈనాటి బీజేపీ ప్రభుత్వం బీసీలను సర్వనాశనం చేస్తున్నది రాబోయే ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే పార్టీలకు పట్టం కట్టాలి. బీసీలంతా ఏకమై చట్టసభలలోకి వెళ్లాల్సిన తరుణం వచ్చేసింది.
బిజెపి పార్టీలో ఉన్న బీసీలు అంతా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంతా బిజెపి పార్టీ నుంచి బయటికి రావాలి, బహుజనులకు ద్రోహం చేస్తున్న బిజెపి పార్టీలో ఉండకూడదు. ఇప్పుడు లెక్కలు తీస్తే ఓబీసీ జనాభా 60 శాతం దాటొచ్చు, దానికనుగుణంగా అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం పెరగాలి.. దేశ వ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు అర్ధాకలితో అలమటిస్తుంటే అదానీకి రోజుకు వెయ్యి కోట్ల ఆదాయం వస్తున్నట్టు ఇటీవల ప్రసార మాధ్యమాల్లో వచ్చింది. ఈ ఆర్థిక దోపిడీని అరికట్టడంతో పాటు దేశంలోని బీసీలకు న్యాయం జరిగేంతవరకు అందరితో కలిసి ఉద్యమించాలి.
డా. ముచ్చుకోట సురేష్‌బాబు,
అధ్యక్షులు,
ప్రజా సైన్స్ వేదిక




