కుట్రలు ఎన్ని పన్నినా కేంద్రం ఆటలు సాగవు

నల్లగొండ,సెప్టెంబర్‌ 13  : ‌మినీ జమిలి పేరిట కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని శాసనమండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి డియాతో మాట్లాడారు. షెడ్యూల్‌ ‌ప్రకారం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలి. కానీ కేంద్రం ఏదో కుట్ర చేస్తుంది. జమిలి ఎన్నికల పేరిట గందరగోళం సృష్టించింది కేంద్రం. కాంగ్రెస్‌ ఆరోపణలు చూస్తుంటే నవ్వొస్తుందని గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ ‌మంత్రివర్గంలో ద్రోహులు ఉన్నారని అంటున్న కాంగ్రెస్‌ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాంగ్రెస్‌లో ఇవాళ తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకులు చేరారు. షర్మిల కూడా కాంగ్రెస్‌లో చేరుతుంది. తెలంగాణ ద్రోహుల పార్టీ కాంగ్రెస్‌ అని చెప్పారు. కుట్రలు చేసి ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. న్యూసెన్స్ ‌చేస్తూ కేంద్రం గట్టెక్కాలనే దురాలోచనలో కేంద్రం ఉందని మండిపడ్డారు. సెప్టెంబర్‌ 17‌న జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని మండలి చైర్మన్‌ ‌పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ప్రజలు భారీగా పాల్గొనాలని సూచించారు. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని చంపేలా కుట్రలు చేస్తుందన్నారు.

రాష్ట్ర భవిష్యత్‌ ‌కోసం తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్‌ఎస్‌ ‌పార్టీని గెలిపించాలని కోరారు. కేటీఆర్‌ ‌సమర్థుడు. గొప్పగా చదువుకున్న వ్యక్తి.. ఈ సారి హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‌ప్రభంజనం సృష్టించబోతుందన్నారు. హైదరాబాద్‌ ‌విశ్వ నగరంగా మారింది కేటీఆర్‌ ‌వల్లనే. అనవసర ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌ ‌పార్టీకి తగదు. బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలవి పగటి కలలే. బీఆర్‌ఎస్‌ ‌వల్లనే సుస్థిరమైన పాలన ఉంటుందని గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *