కిరీటం లేని రాజులా…

భిక్ష మెత్తుకునే అమ్మ
భుజంపై గాఢనిద్రలో
వీధులన్నీ ఊరేగే
కిరీటం లేని రాజులా
ఇష్టాలని పాలిస్తున్నాడు

రెండు చేతులు
కరచుకున్న కౌగిలిలో
కురిసే కేరింతలే
పేదరికంలో దుమికే జలపాతాలు

నేలపై కాలు పెట్టకుండా
ఒడి దాటకుండా
చంక దిగకుండా
వీపు మీదగా
వాడి ఎగుడు దిగుడు చూపులు
ఈ లోకానికి  చిక్కు ప్రశ్నలే….
– శ్రీ సాహితి, 9704437247

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *