కాశ్మీర్‌లో హిమపాతం.. ముగ్గురు జవాన్లుమృతి

శ్రీనగర్‌, ‌నవంబర్‌ 19 : ‌జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో విషాదం నెలకొంది. మచిల్‌ ‌సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద మంచు చరియలు విరిగిడపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మఋతి చెందారు. శుక్రవారం 56 రాష్టీయ్ర రైఫిల్స్‌కు చెందిన జవాన్ల బృందం పెట్రోలింగ్‌కు వెళ్లింది.

పెట్రోలింగ్‌ ‌నిర్వహిస్తుండగా, ప్రమాదవశాత్తు మంచు చరియలు విరిగి పడటంతో.. ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మంచుపాతంలో చిక్కుకుపోయిన మరో ఇద్దరు జవాన్లను రక్షించి, కుప్వారాలోని మిలిటరీ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన జవాన్లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అక్టోబర్‌లో ఉత్తరాఖండ్‌లో సంభవించిన హిమపాతం కారణంగా 27 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *