• కాలం కానీ సమయంలో ఆదుకుంది
• విపక్షాల విమర్శలపై మండిపడ్డ హరీష్రావు
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్26: కాంగ్రెస్ హయాంలో కాలం కోసం ఎన్నో తిప్పలు పడ్డామని, కానీ ఇప్పుడు కాలం కాకున్నా మనకు కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని మంత్రి హరీష్రావు అన్నారు. కాళేశ్వరం నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా అని ప్రశ్నించారు. నీళ్లు లేకపోతే జీవం లేదు, నీళ్లు లేకపోతే బతుకుదెరువు లేదన్నారు. కాళేశ్వరంతో నీటి గోస తీరిందన్నారు. అలాంటి జీవాన్ని సీఎం కేసీఆర్ ఇచ్చారని చెప్పారు. సిద్దిపేటలోని టీటీసీ భవన్లో దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 233 మంది దివ్యాంగులకు ఉపకరణాలను అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడు తూ.. దివ్యాంగులకు దేశంలోనే అత్యధికం గా రూ.4016 పింఛను అందిస్తున్నామ న్నారు. దివ్యాంగుల పట్ల మానవతా దృష్టి, ప్రేమతో దగ్గరికి తీసుకుంటున్న నాయ కుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్టాల్ల్రో రూ.1000 మించి పింఛన్ ఇవ్వడం లేదని విమర్శించారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పార్టీ హయాంలో దొంగరాత్రి కరెంటు, పేలిన ట్రాన్స్ ఫార్మర్లు, కాలిన మోటర్లు అని విమర్శిం చారు. కాంగ్రెస్, బీజేపీలు తిట్ల పోటీలో పోటీ పడుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ వడ్లు పుట్లు పుట్లుగా పండించేందుకు పోటీ పడుతున్నారని తెలిపారు. మన వడ్లు కొనడానికి తమిళనాడు, కర్ణాటక రాష్టాల్రు అడుగుతున్నాయని చెప్పారు. తెలంగాణను దేశ ధాన్యాగారంగా సీఎం కేసీఆర్ మార్చారని తెలిపారు. కాళేశ్వరంపై విమర్శలు చేస్తున్న వారు నీళ్లు వస్తున్న విషయాన్ని గుర్తించడం లేదన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్దిని కూడా చులకన చేయడం దారుణమన్నారు.




ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే