కాలిపోయిన ప్రయాణికుల గుర్తింపునకు చర్యలు

  • ప్రమాదంపై దర్యాప్తు…మృతుల కుటుంబాలకు 7 లక్షల పరిహారం
  • అవసరమైతే డిఎన్‌ఎ ‌టెస్ట్ ‌చేస్తామన్న రాష్ట్ర డిప్యూటీ సిఎం ఫడ్నవీస్‌

‌ముంబై, జూలై 1 : మహారాష్ట్రలో జరిగిన బస్సు ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు సజీవ దహనం కావడంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ‌తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయడంతో పాటు వారిని గుర్తించే పని చేపట్టామని అన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ‌స్పందిస్తూ.. ఈ ప్రమాదంలో 26 మంది చనిపో యారు, ఏడుగురు గాయపడ్డారు. మృతదేహాలను గుర్తించడానికి డీఎన్‌ఏ ‌పరీక్షలు నిర్వహిస్తు న్నామన్నారు.

మానవతప్పిదం వలన ప్రమాదం జరిగిందా? లేక సాంకేతిక లోపం వలన జరిగిందా అన్నది విచారణలో తెలుస్తుం దన్నారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. వీలయితే స్మార్ట్ ‌సిస్టమ్‌ ‌కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ సందర్బంగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్రం కూడా ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి నుండి మృతుల కుటుంబా లకు 2 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *