కాలానికి రోషమెక్కువే…

జరిగేది తెలియనప్పుడు
కోల్పోవడమేమిటి?
పొందటమేమిటి?

జమా ఖర్చులతో
పొగిడినా,నిందించినా
కాలానికి రోషమెక్కువే

తెలియకుండా
ఓ అర్హతనిచ్చి గౌరవంగా
మనసుకు గుర్తింపునిచ్చి

ముఖంపై వేగనిరోధంలేని
మాటల ప్రయాణంలో
తిలకించిన దృశాలలో

కాలం అడుగులను
లిఖించిన వాస్తవాలను
మది మడుగులో మగ్గపెట్టి

తలపుకొచ్చే క్షణకాలంలో
చిగురించిన సువాసనాలతో
దేహాల్లో ఊహలు

తలుపు తెరచుకుని
చిరిగిన కలకు చికిత్సతొ
అరిగిన పాదపు తరిగిన నడకల్ని

గొంతెత్తి
గుండేహత్తుకుంటూ ఓ రాత్రి
నీ పోలికల కలను

బతుకులో నడిపించి
గెలిపించి తీరుతుంది..
తానూ గెలిచి చూపుతుంది.

– శ్రీ సాహితి
9704437247

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *