కాలం ఎప్పుడూ కొత్తదే!

కాలం మనకు కనిపించదు
మనం చెప్పినట్లు వినదు
మనం చెప్పినట్లు నడుచుకోదు
మనం ఆగుమంటే ఆగదు!
కాలం మంచి చెడుల తీర్పు
మానవ నడవడికల మార్పు
రాళ్లమీద నాగరికతల చేర్పు
యుగయుగాల చరిత్రల కూర్పు!
కాలం చేస్తున్న మాయలు
మనం చూస్తున్న అద్భుతాలు
ఉదయ అస్తమానాలు
కాల పరిణామ గమనాలు!
నిరంతర ఆగమన నిష్క్రమనలు
అవతరించడం అంతరించడాలు
మారే పచ్చదనాలు వెచ్చదనాలు
కాల ప్రతీకలు!
నువ్వు పాతగైతెనే
నీకు కొత్తది తెలుస్తుంది
ఏదైనా కొత్తది దర్శించాలంటే
నువ్వు పాతబడి పోవాల్సిందే!
కాలంలో మార్పు చెందేటివన్నీ
పాతబడి పోయేటివే
కాలం కలకాలం
కాలమెప్పుడూ కొత్తదే!
– పి.బక్కారెడ్డి,  9705315250

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *