మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 8: మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 30వ డివిజన్ కార్పొరేటర్ భీమిడి స్వప్న జంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మహేశ్వరం నియోజకవర్గం బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ.. కార్పొరేటర్ 30వ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వప్న జంగారెడ్డి మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గాని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రజలు జేజేలు పలుకుతున్నారని కొనియాడారు. ప్రజల అదర అభిమానులను చూస్తుంటే సబితా ఇంద్రారెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, శ్రేయోభిలాషులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కారు గుర్తుకు ఓటు వేసి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి





