వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర నవంబర్ 9: బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు గురువారం వికారాబాద్ పట్టణంలోని కొత్తగాడి కాలనీలో స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి బిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పది సంవత్సరాలలో అద్భుతమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టి పేదల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధికి బాటలు వేశారన్నారు. 60 సంవత్సరాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ పేదల అభివృద్ధికి ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ఆయన దుయ్యబట్టారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ బిజెపి పార్టీలు అమలుకు నోచుకోని పథకాలు ప్రవేశపెడతామని మేనిఫెస్టోలు ప్రకటించి ముందుకు వచ్చాయని ప్రజలు వాటిని నమ్మవద్దని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ను మరోసారి ఆశీర్వదించి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ప్రభాకర్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలి




