కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 18: పేదల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుందని మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మాజీ కౌన్సిలర్ బోండాల శ్రీనివాస్ గౌడ్ లు పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని ఇందిరానగర్ గరీబ్నగర్ కాలనీలలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల అభివృద్ధి అనేక సంక్షేమ పథకాల అమలు చేశారని మరోసారి టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతాయని తెలిపారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే మరింత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *