కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి బాటలు చేసుకుందాం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 24:  ప్రభుత్వం పేదల అభివృద్ధి అనేక సంక్షేమ పథకాల అమలు చేశారని మరోసారి టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతాయని ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం లింగోజిగూడా డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ఎల్.బి.నగర్ ఓల్డ్ విలేజ్, మసీదు గల్లీ నందు ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సహకారం వల్ల డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంమరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి సుధీర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తాను చేసిన అభివృద్ధి చూసి మరల గెలిపిస్తే చేయబోయే కార్యక్రమాలు గురించి వివరాలతో సహా తెలియచేశారు. అన్ని కాలనీలకు మౌలిక వసతులు ఏర్పరచి కాలనీవాసులకు సుఖమయ జీవితాలకు కావాల్సిన హంగులతో అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎల్.బి.నగర్ అతి పెద్ద నియోజకవర్గం కావడంతో ముఖ్యమంత్రితో మాట్లాడి తానిచ్చిన గ్యారంటీలన్నిటిని పూర్తిచేశానని చెప్పారు. నియోజకవర్గ హద్దులు గూడా తెలియని పార్టీ అభ్యర్థులు రాజకీయ పునరావాసం కోసం కాలనీల చుట్టూ చక్కర్లు కొడుతూ ఓటర్లను వారి గెలుపు కోసం ప్రాధేయపడటం నిజంగా హాస్యాస్పదం, దురదృష్టం. అన్ని విధాలా నియోజకవర్గన్నీ అభివృద్ధి చేసిన తనను నియోజకవర్గ ప్రజలే గెలిపించుకుంటారని తెలియచేశారు. అభ్యర్థుల గుణ గణాలను గుర్తించి ఓటేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *