తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో తాండూరు పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు అయినటువంటి పి ప్రశాంత్ (గోరేపల్లి) సి రవీందర్ (హాజీపూర్) మరియు ఎం యాదప్ప (ఎక్ మై) కానిస్టేబుల్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపక బృందం విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు కానిస్టేబుల్ ఫలితాల్లో తమ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని ఈ సందర్భంగా హర్షం ప్రకటించారు. మున్ముందు కళాశాల విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చేందుకు కళాశాల యాజమాన్యం అధ్యాపక బృందం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ భూపతి రెడ్డి ప్రజ్ఞాపాకులు తదితరులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్ ఫలితాలలో సత్తా చాటిన శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు





