కాకతీయ విశిష్ట కళావైభవం
సంస్కృతి కళల పునర్ వైభవం
కాకతీయ విశిష్ట కళా తోరణం
తెలంగాణ వైభవ ద్వార తోరణం
శిల్పకళ సంస్కృతి పునరుజ్జీవనం
సంస్కృతి సాహిత్య నవనిర్మాణం
కాకతీయ జీవన నైపుణ్య ధారణ
చెరువుల కాలువల నిర్మాణ ప్రేరణ
సంస్కృతి స్వర్ణ యుగ ప్రతీక
చతుష్షష్టి కళా సౌందర్య వేడుక
రమణియ కుడ్య శిల్ప మంజీరాలు
సుస్వర సంగీత మధుర స్వరాలు
మధురానుభూతి మనో మందిరాలు
మరుపురాని శిల్ప కళా దామాలు
సమగ్రతకు – సమైక్యతకు
పట్టం కట్టిన పాలన
సాహితీ సౌరభాల పులకింతల నేల
గులాబీ పరిమళం గుబాలిస్తున్న వేళ
కలిసిమెలిసి జీవిస్తున్న
కంప్యూటర్ కాలమిది
చరిత్ర పునర్నిర్మాణ పురాకృతి
పాలకుల కర్మ ఫల యోగ సుకృతి
(కాకతీయ కళా సప్తాహ వేడుకల సందర్భంగా)
– పి.బక్కారెడ్డి, 9705315250




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల