కాంట్రాక్టు ఏజెన్సీల విధానాన్ని రద్దు చేయాలి

ఘట్కేసర్, ప్రజాతంత్ర ఆగస్ట్ 18 : రాష్ట్రంలో ఎంతో మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను బలి తీసుకున్న కాంట్రాక్టు ఏజెన్సీల విధానాన్ని రద్దు చేసి, తక్షణమే తమ ఉద్యోగాలను క్రమబద్దికరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తూ, రాష్ట్రంలోని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పొట్టకొడుతున్నాయని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసారు. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయలని పోచారం మున్సిపాలిటీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పోచారం మున్సిపల్ కమిషనర్ వేమన రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డిలకు వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు 1.50 లక్షల మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారందరిని రెగ్యులరైజ్‌ చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఎందరో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను బలి తీసుకుంటున్న ఏజెన్సీ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమములో మునిసిపల్ వైస్ చైర్మన్ నానావత్ రెడ్యా నాయక్, బిల్ కలెక్టర్ రాజు, మధు, లక్ష్మి, శివ, వినయ్, వినోద్, వర్క్ ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి, రంగనాయకులు, జహంగీర్, కంప్యూటర్ ఆపరేటర్లు ప్రవీణ్, శివ రెడ్డి, గోవర్ధన్, సంతోష్, కమల్, రేఖ, జవాన్ అశోక్, మోహన్, శ్రీను, సాయి కిరణ్, వినోద్ రెడ్డి, నర్సింగ్, మునిసిపల్ సిబ్బంది  దాసు, మంగా రెడ్డి, జాన్ అలీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *