న్యూఢిల్లీ, సెపస్టెంబర్ 21 : తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై దిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యింది. కాంగ్రెస్ వార్ రూమ్‌లో ఏర్పాటు చేసిన ఈ భేటీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ గౌడ్ హాజరయ్యారు.
రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి 300 మంది అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారి పేర్లను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్కీన్రింగ్ కమిటీకి పంపింది. స్కీన్రింగ్ కమిటీ పరిశీలన అనంతరం అభ్యర్థుల జాబితాను కాంగ్రస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు.




