మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈనెల 17న నిర్వహించనున్న విజయ భేరి సభా స్థలిని సభస్థలాన్ని సోమవారం కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం రాజీవ్ ప్రాంగణంలో విజయభేరి సభ వేదిక భూమిపూజ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మరియు ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కీ గౌడ్, షబ్బీర్ అలీ, జిల్లా డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభా వేదిక మ్యాప్‌ను రేవంత్ రెడ్డి మాణిక్ రావు థాక్రేకు చూపించి ఎక్కడెక్కడ ఏమేమి వొస్తున్నాయో వివరించారు. కార్యక్రమంలో ఇంకా కాంగ్రెస్ నాయకులు మల్ రెడ్డి రంగారెడ్డి, చిగురింత నర్సింహారెడ్డి, దేవభాస్కర్ రెడ్డి , ఏనుగు జంగారెడ్డి,
కొత్తమనోహర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శులు జానకిరామ్, అమరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.




