సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 26: సదాశివ పేట మాజీ మున్సిపల్ అధ్యక్షురాలు పట్నం విజయలక్ష్మి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి జగ్గారెడ్డి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ లో స్వేచ్ఛగా సేవ చేయొచ్చు అని, తిరిగి కాంగ్రెస్ పార్టీ లోకి రావడం సంతోషంగా ఉందని జగ్గారెడ్డి అన్నారు.సుభాష్ మంచి ఆర్గనైజర్ అని, అందరినీ కలుపుకొని పని చేస్తాడని తెలిపారు. పార్టీ వీరి సేవలను ఉపయోగించుకుంటుందని, తగిన ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివరించారు.
పట్నం విజయలక్ష్మి సుభాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కి సేవ చేసుకోడానికి అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డిని కోరామని అన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్ రాంరెడ్డి, సదాశివపేట్ మండల ప్రెసిడెంట్ సిద్దన్న, టౌన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ,కంది కృష్ణ సంగమేశ్వర్ మగ్దుం పటేల్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ లో చేరిన సదాశివ పేట మాజీ మున్సిపల్ ఛైర్మన్




