– పార్టీ శ్రేణులకు హరీష్‌రావు పిలుపు
సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ టి.హరీష్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పటాన్‌చెరు నియోజకవర్గం బొల్లారంనకు చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండి.ఆరిఫ్, మరో 25 మంది సభ్యులు బీఆరఎస్ సీనియర్ నాయకుడు బాలరెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలంటే సోషల్ మీడియాలో అత్యంత చురు>్గ± ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంలో సోషల్ మీడియానే నేడు కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర యువతను తీవ్రంగా దగా చేసిందని, ఎన్నికలకు ముందు అమలుకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక నిలువునా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ లేదు.. కొత్తగా ఉద్యోగాల కల్పన లేదు.. వారు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాల హామీ పూర్తిగా బోగస్ అని తేలిపోయింది అని విమర్శించారు. యువతతోపాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని మండిపడ్డారు. అవ్వాతాతలకు పెన్షన్లు పెంచకుండా, కోటిమంది మహిళలకు నెలకు రూ.2500 చొప్పున ఇవ్వకుండా, రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ప్రతి వర్గాన్నీ దారుణంగా మోసం చేసిందన్నారు. ఈ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యువత ముందుకొచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ పటాన్‌చెరు ఇన్‌చార్జి ఆదర్శ్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
జహంగీర్ మరణం తీరని లోటు
తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో 1996 నుండే గళమెత్తిన అరుదైన కళాకారుడు తుర్కపల్లి ముద్దుబిడ్డ జహంగీర్ మరణం తీరని లోటు అని హరీష్‌రావు అన్నారు. సాంస్కృతిక ఉద్యమానికి తొలి వెలుగులు ప్రసరించిన తొలితరం కళాకారులలో ఆయన కృషి చిరస్మరణీయమన్నారు. మంజీరా రచయితల సంఘం, తెలంగాణ జనసభలలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ అమరురాలు బెల్లి లలిత వంటి వారితో కలిసి ఉద్యమ బాటను పంచుకున్న నిఖార్సైన ఉద్యమకారుడు జహంగీర్ అని కొనియాడారు. ఆనాటి సమైక్యవాద పాలకుల చిత్రహింసలను భరిస్తూ కూడా తెలంగాణ ఆకాంక్షను వదలకుండా పోరాడిన ఆయన త్యాగశీలి. సాంస్కృతిక లోకానికి ఆయన మరణం పూడ్చలేని వెలితిని మిగిల్చిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఉద్యమంలో అగ్రభాగాన లాయర్లే
ఉస్మానియా వర్సిటీలోకి వస్తుంటే ఎన్నో పాత జ్ఞాపకాలు, ఉద్వేగభరిత సంఘటనలు గుర్తొస్తున్నాయి.. లా పూర్తి చేసుకొని నల్ల కోటు వేసుకొని బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పరిరక్షకులుగా మారబోతున్న మీ అందరికీ అభినందనలు అని హరీష్‌రావు అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ విద్యార్థుల ఆధ్వర్యంలో ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో జరుగుతున్న ‘డ్యూసిమస్-విjáYT లీడ్ (ణU్పుIవీUS – ఔజు LజుAణ) ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాఫ్ట్‌వేర్, డాక్టర్ వైపే మక్కువ చూపుతున్న ఈ రోజుల్లో మీరు లా చదవడం అంటే ప్రత్యేకతేనన్నారు. దేశంలో జరిగిన అనేక ఉద్యమాల్లో, ఆఖరికి తెలంగాణ ఉద్యమంలో కూడా న్యాయవాదులే అగ్రభాగంలో ఉన్నారన్నారు. సాగర హారం, మిలియన్ మార్చ్, రహదారుల దిగ్బంధం, ఉస్మానియా వర్సిటీలో జరిగిన ఉద్యమానికి అండగా నిలబడ్డది న్యాయవాదులేనని గుర్తు చేశారు. ఎక్కడైతే న్యాయం ఉంటుందో అక్కడ న్యాయవాదులు ఉంటారు.. ఎక్కడ న్యాయవాదులు ఉంటారో ఆ పోరాటం గమ్యాన్ని చేరుతుంది.. విజయం సిద్ధిస్తుంది అని అన్నారు. ‘Iఅjustఱcవ aఅywష్ట్రవతీవ ఱs a tష్ట్రతీవat tశీ justఱcవ వఙవతీy wష్ట్రవతీవ’ మార్టిన్ లూథర్ కింగ్ మాట గుర్తుపెట్టుకోవాలని సూచించారు. న్యాయం దక్కని పీడితుల పక్షాన గొంతై నిలవండి.. ప్రభుత్వాలు పోరాటాలను అణచివేయాలని చూసే సమయంలో మీరు సమాజానికి అండగా నిలబడండి అని పిలుపునిచ్చారు. కాగా, మాట్లాడే స్వేచ్ఛను హరించడానికే రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్ బిల్లును తీసుకొచ్చాడు. ప్రశ్నిస్తే, ప్రభుత్వ తప్పిదాన్ని వేలెత్తి చూపిస్తే కేసు పెట్టాలని ప్లాన్ చేస్తే శాసనసభ్యులంతా వ్యతిరేకిస్తే అది సెలెక్ట్ కమిటీకి పోయిందని చెప్పారు. ఫ్రీడమ్ అఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంబేద్కర్ ఈ దేశ ప్రజలకు కల్పించిన హక్కు.. దాన్ని కాపాడాల్సిన బాధ్యత యువ లాయర్లుగా మీ మీద ఉన్నదని అన్నారు. ఠాకూర్ ఆడిటోరియంకు ఉద్యమంలో ప్రత్యేక స్థానం ఉందని, వేణుగోపాల్ రెడ్డి అనే తెలంగాణ బిడ్డ స్వరాష్ట్రం కోసం ఇక్కడే ప్రాణత్యాగం చేశాడని గుర్తు చేశారు. అసెంబ్లీ ముట్టడికి వస్తుంటే ఎన్‌సీసీ గేట్ దగ్గర యాదయ్య అనే యువకుడు చేసిన ప్రాణత్యాగం ఇంకా కండ్ల ముందు కనిపిస్తున్నదన్నారు. ఒకప్పుడు అసెంబ్లీలో లాయర్లు ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు డాక్టర్లు ఎక్కువవుతున్నారు.. యువత రాజకీయాల్లోకి రావాలి. దేశానికి కొత్త మార్గదర్శకత్వం కావాలి అని హరీష్‌రావు అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





