పేదల సంక్షేమ అభివృద్ధి కృషి చేస్తున్న టిఆర్ఎస్ ను మరోసారి దీవించాలి.
ఎన్నికల ప్రచారంలో జెడ్పిటిసి ప్రమోదిని దేవి ఏఎంసి మాజీ చైర్మన్ విటల్ నాయక్.
తాండూరు ప్రజాతంత్ర అక్టోబర్ 31: ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న మోసపూరిత హామీలకు మోసపోవద్దని పేదల సంక్షేమం అభివృద్ధికి కృషి చేస్తున్న బిఆర్ఎస్ పార్టీని మరో సారి ఆశీర్వదించాలని జడ్పిటిసి ప్రమోదిని దేవి. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విటల్ నాయక్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం యాలాల మండలం భాను పూర్ తోపాటు అన్న సాగర్, పగిడియాల్, బాగాయి పల్లి, గ్రామాలలో ఎమ్మెల్యే తల్లి వికారాబాద్ జడ్పిటిసి ప్రమోదిని దేవితో కలిసి స్థానిక నాయకులు గడపగడపకు తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా జడ్పిటిసి ప్రమోదిని దేవి.మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే గిరిజన తండాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి తండాలను గ్రామపంచాయతీలు గా తీర్చిదిద్దారని తెలిపారు. అదేవిధంగా గిరిజనుల సంక్షేమం కోసం బంజారా భవనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం హయాంలో జరిగిన సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చోరవతోనే యాలాల మండలంలోని ప్రతి గ్రామంలో కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందని తెలిపారు.గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే అధికంగా అభివృద్ధి చేసి చూపించామని చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు..ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ అధ్యక్షులు అక్బర్ బాబా , వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, బోయిని సాయిలు బసిరెడ్డి అశోక రెడ్డి శేఖర్ రెడ్డి సీనియర్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.




