కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కానొద్దు

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్‌, అక్టోబర్‌ 27 : సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోమారు బీఆర్‌ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని.. గతంలో పాలించిన కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కానొద్దని..బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి,సంక్షేమాన్ని ప్రజలు చూసి మరోమారు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.శుక్రవారం చేవెళ్ల మండలంలోని ఊరెళ్ల, అనుబంధ గ్రామం మొండివాగు,దేవునిఎర్రవల్లి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే కాలె యాదయ్య సర్పంచ్‌లు జహంగీర్‌, సామ మాణిక్యరెడ్డితో కలిసి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. మరింత అభివృద్ధికి మరోమారు తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు.ప్రజలకు సాగు,తాగు నీరు,24 గంటల కరెంట్‌ యథావిధిగా కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్‌ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌ను హ్యాట్రిక్‌ ముఖ్యమంత్రిని చేయాలన్నారు.ప్రతి పక్షాల కల్లబొల్లి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని,మోసపోతే గోసపడుతామన్నారు.నిన్నకాక మొన్న కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాగ్ధానాలను విస్మరించిందన్నారు.కర్నాటకలో రైతులు పెద్దయెత్తున ఆందోళనలు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు రైతు బంధు, రైతు బీమా,ఆసరా పింఛన్లు,మిషన్‌ భగీరథ ద్వారా ఇంటికీ నల్లా ద్వారా తాగు నీరు,మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ,కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌,సీఎం సహాయ నిధి గృహలక్ష్మి,దళిత బంధు తదితర పథకాలు శాశ్వతంగా కొనసాగాలంటే మరో పదేండ్లు సీఎం కేసీఆర్‌ మనకు ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు.గతంలో 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరాకు అవుతుందని గుర్తు చేశారు.ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మరి అభివృద్ధి,ప్రజా సంక్షేమానికి పాటు పడుతున్న సీఎం కేసీఆర్‌ సర్కార్‌ను మరో మారు గెలిపించి అభివృద్ధికి పెద్దపీట వేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాలతి,వైస్ ఎంపీపీ శివ ప్రసాద్‌,వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మిట్ట వెంకట రంగారెడ్డి,వైస్ చైర్మన్‌ నర్సింలు, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్‌,చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ వైస్ చైర్మన్‌,బీఆర్‌ఎస్ సీనియర్‌ నాయకుడు మాసన్నగారి మాణిక్యరెడ్డి,బీఆర్‌ఎస్ మండల బీసీసెల్‌ అధ్యక్షుడు ఎదిరె రాములు,బీఆర్‌ఎస్ సీనియర్‌ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి,రైతు బంధు సమితి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జు రెడ్డి, బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శులు నరేందర్‌ గౌడ్‌, హన్మంత్‌రెడ్డి,దేవునిఎర్రవల్లి ఉప సర్పంచ్‌ లతానర్సింలు,బీఆర్‌ఎస్ నాయకులు సామ రంగారెడ్డి, సామ విఠల్‌రెడ్డి,ఎదిరె మాణిక్యం,వార్డు సభ్యులు మల్లేష్‌,హరీశ్‌,రాములు,పీఏసీఎస్ డైరెక్టర్‌ శ్యామలయ్య,నాయకులు ఎదిరె శ్రీశైలం,జంగయ్య గౌడ్‌,సర్పంచ్‌లు శేరి స్వర్ణలతాదర్శన్‌,వెంకటేశం గుప్తా,విజయలక్ష్మినర్సింలు,భీమయ్య,బీఆర్‌ఎస్ మైనార్టీ సెల్‌ మండల అధ్యక్షుడు అబ్దుల్‌ ఘని, బీఆర్‌ఎస్ మండల యూత్‌ అధ్యక్షుడు శేఖర్‌,బీఆర్‌ఎస్ నాయకులు వంగ శ్రీధర్‌రెడ్డి,శేరి రాజు,శేరి శ్రీనివాస్,సాయినాథ్‌,బీఆర్‌ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *