ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 16: కాంగ్రెస్, బిజెపి ల అమలు గాని హామీలను నమ్మొద్దని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. నాచారం డివిజన్, బిఆర్ఎస్ గ్రేటర్ సీనియర్ నాయకులు సాయి జెన్ శేఖర్ ఆధ్వర్యంలో, శ్రీ సాయి నగర్ సాయి వెల్ఫేర్ అసోసియేషన్ తమ సంపూర్ణ మద్దతు కి బండారి లక్ష్మారెడ్డి తెలిపారు . ఈ సందర్బంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గ అభివద్ధి కొరకు సీఎం కేసీఆర్ నీ సంప్రదించి 50 కోట్ల నిధులు మంజూరు చేపించానని, ఎన్నికల తర్వాత టెండర్ పిలిచి ఆ పనులు మొదలు పెడతామని తెలిపారు. ఉప్పల్ ప్రజలు ఆరోగ్య సమస్యలతో గాంధీ, ఉస్మానియాకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉప్పల్ నియోజకవర్గానికి 100 పడకలఆసుపత్రితీసుకొచ్చానన్నారు తీసుకొచ్చానన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ఉప్పల్లో బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి తనని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి ని అత్యంత భారీ మెజారిటీతో గెలుపిస్తామని తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం తమ కాలనీలలో సమస్యల వినతపత్రాన్ని బండారి లక్ష్మారెడ్డి కి అందజేశారు. లక్ష్మారెడ్డి సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉప్పల్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బిజెపి ల అమలు గాని హామీలను నమ్మొద్దు బండారి లక్ష్మారెడ్డి





