తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: కాంగ్రెస్ బిజెపి పార్టీల ప్రలోభాలకు మోసపోవద్దని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రజలకు సూచించారు ఎన్నికల శంఖారావం లో భాగంగా గురువారం పెద్దముల్ మండలం గుట్లపల్లి లో నిర్వహించిన ఎన్నికల శంకరావ సభలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి పార్టీలో ప్రలోభాలకు మోసపోవద్దని అభివృద్ధిని చూసి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాండూరు పట్టణంలో రాజకీయాలకు అతీతంగా అన్ని వార్డులకు కోటి రూపాయలు కేటాయించి అభివృద్ధి అన్ని వార్డులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో బైపాస్ రోడ్డు పనులు కూడా అవుతే వాయు కాలుష్య సమస్య దూరం అవుతుందని అన్నారు తాండూరు నడిబొడ్డులో లారీ పార్కింగ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను అంతారం గ్రామం వద్ద ఆటోనగర్ కు తరలిస్తున్నామని అన్నారు.పట్టణ నలుదిక్కుల ఉన్న పాలిష్ యూనిట్లను జిన్ గుర్తి గ్రామం వద్ద ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక వాడకు తరలిస్తున్నము. త్వరలో పాత తాండూరు బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. దేశంలోనే ఇక్కడ లేని వధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందని అన్నారు ఎన్నికల్లో ఈ అని హామీలు సైతం చేపట్టడం జరిగిందని అన్నారు రాబోయే రోజుల్లో మరొకసారి టిఆర్ఎస్కు అధికారం ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తారని అన్నారు. ఇప్పటికే టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి దత్యాయని అన్నారు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసమే వివిధ సంక్షేమ కార్యక్రమాలను తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తం రావు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు పలువురు కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ బిజెపి పార్టీల ప్రలోభాలకు మోసపోవద్దు





