కాంగ్రెస్, బిజెపికి ఓట్లు వేస్తే అభివృద్ధి ఆగమవుతుంది -మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రజాతంత్ర,బాలాపూర్: నవంబర్ 8: తెలంగాణ రాష్ట్రంతో పాటు మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఓట్లు వేసి, గెలిపిస్తే అభివృద్ధి  ఆగమవుతుందని, చితికిన బతుకులు భవిష్యత్తులో కంటికి కనిపించకుండా పోతాయని, ప్రతి అప్రమత్తంగా ఉండాలని మహేశ్వరం నియోజకవర్గంబిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి, మీ జీవితాలకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. బుధవారం మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం లోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి బిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మాత్రమే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని, అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అభివృద్ధిని ఆకక్షించే వారికే పట్టం కట్టాలని కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్టం మరింత అభివృద్ది చెందాలంటే, ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విన్నవించారు.
ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *