కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్ఎస్లో చేరుతారు
తెలంగాణలో బిజెపి ప్రజాస్వా భ్రుత్వం రావడం ఖాయం
ఇంటింటికీ బిజెపి కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లిన బిజెపి నేతలు, కార్యకర్తలు
బిజెపి ఎవరితోనూ పొత్తు పెట్టుకోదన్న బిజెపి రాష్ట్ర చీఫ్ బండి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి ఇంటింటికీ బీజేపీ కార్యక్రమానికి కమలం పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒకేరోజు 35 లక్షల కుటుంబాలను బీజేపీ నేతలు, కార్యకర్తలు కలవనున్నారు. అధ్యక్షుడు బండి సంజయ్ మొదలు పోలింగ్ బూత్ అధ్యక్షుల వరకు ప్రతి ఒక్క కార్యకర్త ఇంటింటికీ బీజేపీ పేరుతో జనంలోకి వెళ్లారు. ఒక్కో కార్యకర్త తమ పరిధిలోని పోలింగ్ బూత్‌లో కనీసం వంద కుటుంబాల వద్దకు వెళ్లి నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ కరపత్రాల పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కరీంనగర్ లోని 57వ డివిజన్, 173వ పోలింగ్ బూత్‌లోని ప్రజలను బండి సంజయ్ కలిశారు. అంబర్‌పేట, నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో మోదీ తొమ్మిదేళ్ళ పాలనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రజలను కలిశారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికీ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఉదయం నుంచి ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా అంబర్‌పేటలో ఇంటింటికీ బిజెపి కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి వి•డియాతో మాట్లాడుతూ…కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని అన్నారు. తెలంగాణలో వొచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్ఎస్లో చేరుతారన్నారు. బీజేపీతోనే తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం సాధ్యమవుతుందన్నారు. మోదీ నాయకత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటుందన్నారు. అవినీతి పార్టీలు ఏకమైతే దేశం కుక్కలు చింపిన విస్తరవుతుందన్నారు. బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ..ఈ రోజు ఓ కుటుంబం పాలైందన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం వేలకోట్ల ప్రజల డబ్బును దోచుకొని మళ్లీ ఏలాలనుకుంటోందన్నారు. భూములు, బిల్డింగ్లు కొనాలనుకుంటున్నారన్నారు. తెలంగాణ అవినీతిమయం అయిందని.. కల్వకుంట్ల కుటుంబంపాలైందన్నారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే నిలబడుతుందన్నారు. బీఆర్ఎస్తో బీజేపీ ఇప్పటి వరకూ పొత్తు పెట్టుకోలేదని కిషన్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో జరిగిన కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని… ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం జిల్లాలోని 57వ డివిజన్లో బండి సంజయ్ పర్యటించారు. 9 ఏళ్ల మోదీ పాలనను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హావి•లు ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. నువ్వు కట్టిన ఇళ్ళు ముడితే కూలిపోతున్నాయని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు వోటేస్తే.. బీఆర్ఎస్కు వేసినట్లే అని అన్నారు. నేను బీఆర్ఎస్ సపోర్ట్‌తో గెలిస్తే.. మరి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ ఎలా గెలిచారని అంటూ ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ కు అసలు డిపాజిట్ వొచ్చిందా అని అడిగారు. కాంగ్రెస్ మునిగిపోయే నావా అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంపి సోమం బాపూరావు పాల్గొన్నారు. మోదీ వల్లనే దేశం పటిష్టింగా ఉందన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒక్కటేనని అన్నారు. ఆ పార్టీలను నమ్మితే మునగడం ఖాయమని అన్నారు. ఇంటింటికి వెళ్లి ఆయన కరపత్రాలు పంపిణీ చేశారు.



