కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండూ ఒక్కటే

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్‌ 24 :   ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ లోని  సాయిబాబా కాలనీ, సాయి నగర్, పద్మారావు నగర్, వంపుగూడ, సాకేత్, తదితర ఖాళీలలో నియోజకవర్గ బిజెపి అభ్యర్థి డాక్టర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు, ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడికే ప్రజల గురించి అవగాహన ఉంటుందని, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటాడని, అటువంటి నాయకుడిని మీరు ఎన్నుకోవాలని ప్రభాకర్ పిలుపునిచ్చారు. మౌలిక సదుపాయాలు విషయంలో ప్రస్తుతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,  ,మహిళా భవన్, లు మంచినీటి మంచినీటి సరఫరా ట్యాంకులు ఇవన్నీ కూడా తాను ఉన్నప్పుడు చేసినవేనని ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ గాని ఎమ్మెల్యే గాని పట్టించుకున్న దాఖలు లేవని అన్నారు. కాంగ్రెస్ ,బిఆర్ఎస్ ఓటు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. మీరు అవకాశం ఇస్తే మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని అన్నారు. నవంబర్ 30 వ తారీఖు నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో  కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను  అత్యధిక మెజార్టీతో గెలిపించాలని  ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *