కాంగ్రెస్ ప్రచారానికి అనూహ్య స్పందన

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  03: కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ ను  గెలిపించాలని  శుక్రవారం  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్ వరగంటి వెంకటేష్    గడపగడపకు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని  గెలిపించాలని  ప్రజలను  కోరారు . కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించారు. చేతి గుర్తుకు ఓటు వేసి తోటకూర వజ్రష్ యాదవ్ ను గెలిపించాలని కోరారు.  ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ప్రజాస్వామ్య పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు.  బిఆర్ఎస్ పాలనలో  ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ వైపు  ప్రజలు చూస్తున్నారని  అన్నారు.  బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి,  సంక్షేమ పథకాలు  అమలు కాలేదని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజయం సాధించదని, కాంగ్రెస్ విజయం ఖాయమని తెలిపారు.  ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి   అనూహ్య స్పందన  లభిస్తుందని,  కాంగ్రెస్ విజయం తథ్యం అన్నారు.  ఈ  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,  కార్యకర్తలు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *