దేశం ఎంతగా పురోగమించిందో గమనించండి
మోదీ వొచ్చాకనే ప్రపంచంలో గుర్తింపు వొచ్చింది
దేశ అభివృద్ధ్ది కోసం బిజెపికి వోటేయాలి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్
తండ్రీ, కొడుకులతోనే తెలంగాణ నాశనమయిందని వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను చూసి జాలిపడాలన్నారు. ఓటమి తర్వాత కూడా ఆయన సీఎం అయినట్టు ఫీల్ అవుతున్నారని అన్నారు. పదేళ్లుగా దేశంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలపైనే బీజేపీ ప్రచారం ఉంటుందని వెల్లడిరచారు. సీఎం కావాలనుకున్న కేటీఆర్ ఆశలయ అడియాశలు అయ్యాయన్నారు. అవినీతి ఆరోపణలు లేకుండా మోదీ పాలన సాగిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యిందన్నారు. ప్రజల బ్రతుకులు మారలేదన్నారు. తాత్కాలికంగా వోట్లు పొందేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసిందని విమర్శించారు. ప్రపంచానికే సాయం చేసే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు. సంక్షేమం కోసం 34 లక్షల రూపాయలు ఖర్చు చేసింది మోదీ ప్రభుత్వమని తెలిపారు. దేశంలో డిజిటల్ విప్లవం తీసుకుని వొచ్చామని.. జీఎస్టీ వ్యాపారస్తులకు వరంగా మారుతోందన్నారు.
1.66 లక్షల కోట్ల రూపాయలు ప్రతి ఏటా జీఎస్టీ ద్వారా దేశానికి ఆదాయం వొస్తుందన్నారు. 26,500 కోట్ల డిజిటల్ ట్యాన్జక్షన్స్ దేశవ్యాప్తంగా జరిగాయన్నారు. ఎంఎస్‌ఎంఈల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వొచ్చాయన్నారు. జనధన్ ఖాతాలతో 2 లక్షల కోట్ల రూపాయలు నేడు వారి సేవింగ్స్ అకౌంట్‌లలో జమ చేసుకున్నారన్నారు. పన్ను రాయితీ 7 లక్షల రూపాయలకు పెంచింది మోదీ ప్రభుత్వమని చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు 12 వేల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేసిందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణంతో ప్రమాదాలు తగ్గిపోయాయన్నారు. 20 వేల కిలోటర్ల మేర రైల్వే లైన్‌లకు విద్యుద్ధీకరణ పూర్తి అయ్యిందన్నారు. రోడ్ నెట్వర్క్‌లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నామన్నారు. 101 దేశాలకు కొరోనా వ్యాక్సిన్ అందజేశామని.. 411 కంపెనీలు దేశంలో సెల్‌ఫోన్ ఉత్పత్తి చేస్తున్నాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.




