కాంగ్రెస్ పార్టీ విజయం ..ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు

తెలంగాణా మూడవ శాసన సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 నియోజక వర్గాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. భారత్ రాష్ట్ర సమితి 39 స్థానాలతో రెండవ స్థానంలో నిలిచింది. భారతీయ జనతా పార్టీ 8, మజ్లీస్ 7 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.  బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గజ్వెల్ నియోజక వర్గం లోవిజయం సాధించారు ..కామారెడ్డి లో ఓడిపోయారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లో విజయం సాధించారు. మంత్రులు కె.టీ.రామారావు,హరీష్ రావు,మల్ల రెడ్డి విజయం సాధించగా మిగతా మంత్రులు అందరూ ఓటమి పాలయ్యారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా లో 10 స్థానాల్లో భద్రాచలం బీఆర్ ఎస్ విజయం సాధించగా మిగతా 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, కొత్తగూడెం లో సీపీ ఐ  విజయం సాధించింది.ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 స్థానాల్లో 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో బీఆర్ ఎస్ విజయం సాధించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా 12 నియోజక వర్గాల్లో 11 కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సూర్య పేట లో మంత్రి జగదీశ్ రెడ్డి విజయం సాధించారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది..14 స్థానాల్లో 12 గెలిచింది ..బీ ఆర్ ఎస్ 2 స్థానాలు కైవసం చేసుకుంది.ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 స్థానాలకు గాను 10 స్థానాల్లో   కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా 2 స్థానాల్లో బీఆర్ ఎస్ గెలిచింది. ఉమ్మడి కరీంనగర్ 12 నియోజక వర్గాల్లో 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ,5 స్థానాల్లో బీ ఆర్ ఎస్ విజయం సాధించింది. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం కనిపించలేదు. మొత్తం 19 స్థానాలకు గాను ..12 నియోజక వర్గాల్లో బీఆర్ ఎస్ విజయం సాధించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లో మిశ్రమ ఫలితాలు కనిపించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *