కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం

కాంగ్రెస్ సీనియర్ నాయకులు శీను సుందర్.
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 27: శాసనసభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ శీను సుందర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ శీను సుందర్ వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసాద్ కుమార్ కూతురు అనన్య చేతన్ పట్టణంలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వికారాబాద్ లో సీనియర్ సుందర్ ప్రసాద్ కుమార్ కూతురు అనన్య మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలు అభివృద్ధి దిశగా సాగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చేతి గుర్తుకు ఓటు వేసి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే కావడం ఖాయమని వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *