కాంగ్రెస్ పార్టీ లో చేరిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: వికారాబాద్ నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసిన డాక్టర్ చంద్రశేఖర్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి తెలంగాణ సాధనకు పనిచేసి మంత్ర పదవికి రాజీనామా చేసిన డాక్టర్ చంద్రశేఖర్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే మరియు రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ లో చంద్రశేఖర్ చేరారు. ఇటీవలే బిజెపికి రాజీనామా చేసిన చంద్రశేఖర్ జహీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వరిలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం దోచుకుని నీళ్లు నిధులు నియామకాలను అనుభవిస్తూ తెలంగాణ ప్రజానీకాన్ని మోసానికి గురి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడితేనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో సాగుతూ నీళ్లు నిధులు నియామకాలు జరిగి తెలంగాణ అన్ని విధాలుగా సస్యశ్యామలం అవుతుందని ఆయన పేర్కొన్నారు. బిజెపి బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని ఆయన పేర్కొన్నారు. బిజెపికి ఓటు వేసిన బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినట్లేనని బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే బిజెపికి ఓటు వేస్తే వేసినట్లేనని ఆ పార్టీలను నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *