కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుని సన్మానించిన నేతలు 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : ఆమనగల్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల నూతనంగా నియామకమైన తెల్గమల్ల జగన్ ను నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పివి మోహన్ జి లతో కలిసి డీసీసీ అధ్యక్షులు వంశీ కృష్ణ, పీసీసీ ఉపాధ్యక్షుడు చెరకు సుధాకర్, పీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు  మల్లెపల్లి జగన్, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి లు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి,. యాట నరసింహ, మోత్య నాయక్, కృష్ణ నాయక్, పార్వత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పుస్తకాల రాహుల్, తకెళ్ల పల్లి శేఖర్, అజీమ్, రవీందర్ యాదవ్, దశరథం, పెంటయ్య, జనార్దన్ రెడ్డి, శ్రీకాంత్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు పరుశురాం, ఫరిద్, శబుద్దిన్ తదితరులు జగన్ను సన్మానించిన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *