ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 31 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అదే విధంగా ఎన్నికల మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తారని ధీమాతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు గులాబీ పార్టీలో చేరారు. కెసిఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని సర్వేల రిపోర్టు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నాయకులు క్యూ కడుతున్నారనీ దశరథ్ నాయక్ అన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు కడ్తాల మండలంలోని బాలాజీ నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని రేఖలకుంట తండాకు చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు, కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, రైతు కోఆర్డినేటర్ వీరయ్య, సర్పంచ్ హరి చంద్ నాయక్, దేవ్ సింగ్, కిషన్, పవన్, హనుమ, అమర్ సింగ్, శీను, హంజీ, జైపాల్, వినోద్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు గులాబీ పార్టీలో చేరిక





