కాంగ్రెస్ పార్టీ తోనే పేదోళ్ళ ఇండ్లల్లో వెలుగులు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: కాంగ్రెస్ పార్టీతోనే  పేదోళ్ళ ఇండ్లలో వెలుగులు నిండుతాయని శేరీలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెంట్ ఎమ్మెల్యే వి. జగదీష్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి
సంక్షేమ పథకాల కొరకై ఏర్పాటు చేసిన దరఖాస్తు కేంద్రాలను పరిశీలించారు. అక్కడికి వచ్చిన మహిళలకు దరఖాస్తు పత్రములను అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై మహిళలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 28 డిసెంబర్ 2023 నుండి 6 జనవరి 2024 వరకు ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని తెలిపారు.
దరఖాస్తులను అధికారులే ఉచితంగాఅందజేస్తారు.ఒక్కరు కూడా ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తెలియజేశారు .
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా ప్రతిఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలాగా పని చేయాలని,ప్రతి కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్త పర్యవేక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ
ప్రజలందరూ ప్రభుత్వ పథకాలనువినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమం నేటి నుంచి జనవరి 6 వ తేదీ వరకు ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల పథకాలు అర్హులైన పేద ప్రజలకు అందించే విధంగా అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలన్నారు.ప్రజల నుంచి మహాలక్ష్మి,అభయ హస్తం,రైతు భరోసా,ఇందిరమ్మ ఇండ్లు,గృహజ్యోతి,చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తులను నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని,రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను ఎంపిక చేయాలని తెలిపారు.క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.అర్హులైన లబ్ధిదారులందరు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగ పరుచుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు,డివిజన్ అధ్యక్షులు,మహిళలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *