తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2: కాంగ్రెస్ పార్టీతోనే పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు మండలం ఖాంజాపూర్ కు చెందిన పలువురు టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిసిసిబి చైర్మన్ బియ్యని మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతరం ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న కెసిఆర్ కుటుంబ పాలనకు చర్మ గీతం పాడాలని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారన్నారు. రైతు రుణమాఫీ, డబు ల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ, నిరుద్యోగ భృతి వంటి అనేక హామీలను ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సోనియాగాంధీ ప్రకటించిన ఆరు డిక్లరేషన్ తూచా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీతోనే పేదల బతుకులు బాగుపడతాయని అన్నారు ఎస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రతి గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ నాయకులు వివరించి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ తొనే పేదల జీవితాల్లో వెలుగులు



