కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో నేడు ఖమ్మంలో జన గర్జన సభ

  • హాజరు కానున్న పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే, అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ
  • పార్టీలో చేరనున్న మాజీ ఎంపి పొంగులేటి తదితరులు
  • నేడు ఖమ్మంలో ముగియనున్న సిఎల్‌పి నేత భట్టి పాదయాత్ర
  • కోమటిరెడ్డి పోస్టర్‌లో రేవంత్‌ ‌ఫోటో మాయం : మరోమారు బయటపడ్డ విభేదాలు

కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 1 : నేడు ఖమ్మంలో కాంగ్రెస్‌ ‌పార్టీ జన గర్జన పేర భారీ ఎత్తున నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే, అగ్ర నేత రాహుల్‌ ‌గాంధీ హాజరు కానున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. నేతలు జనాన్ని సవి•కరించే పనిలో ఉన్నారు. ఒక వైపు ఈ సభలోనే మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో పాటు నేడు కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరుబోతుండగా మరో వైపు పీపుల్స్ ‌మార్చ్ ‌పేరిట సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క మార్చ్ 16 ‌నుంచి చేస్తున్న పాదయాత్రకు ముగింపుకు కూడా ఈ సభ వేదిక కానుంది. కాగా ఈ తరుణంలో ఖమ్మంలో పొంగులేటికి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పొంగులేటి అనుచరుల శవాలు కూడా మిగలవని పోస్టర్ల ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరికలు జారీ చేసారు. ఖమ్మంలో పలు చోట్ల ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. మంత్రి పువ్వాడ అజయ్‌పై, బీఆర్‌ఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ పోస్టర్లలో హెచ్చరికలు జారీ చేశారు.

అయితే పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ ‌నేతలు ఐక్యంగా ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక విధంగా ఈ సభ ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ ‌శంఖారావం పూరించనుండడంతో భారీ ఎత్తున జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాహుల్‌గాంధీ రానున్న ఈ సభకు తెలంగాణ జనగర్జన సభగా నేతలు పేరుపెట్టారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఖమ్మం-వైరా రోడ్డులో ఎస్‌ఆర్‌ ‌గార్డెన్‌ ‌సవి•పంలోని వంద ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి.. యంత్రాలు, ట్రాక్టర్ల సాయంతో చదును చేశారు. వాహనాల పార్కింగ్‌ ‌కోసం ఆ స్థలానికి సవి•పంలోని మరో 100 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఓ వైపు పార్టీ నేతలు, శ్రేణులతో పాటు త్వరలో పార్టీలో చేరబోయే పొంగులేటి అనుచరులు కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు అన్ని జిల్లాల నుంచి దాదాపు 5 లక్షల మంది వరకు జనసవి•కరణ చేసి తమ సత్తా చాటాలని భావిస్తున్నారు.

రాహుల్‌గాంధీతోపాటు కర్నాటక డీప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ‌టీపీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి, రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ ఎం‌పీలు, మాజీ ఎంపీలు, ఏఐసీసీ, పీసీసీ నేతలు ఈ సభకు హాజరుకానున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు మరికొందరు ఇతర జిల్లాల నేతలు అదే సభలో కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరబోతుండటంతో కాంగ్రెస్‌ ‌పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభ రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహాన్ని తెస్తుందని నేతలు ఆశిస్తున్నారు. ఇదిలావుంటే ‘చట్టం వి•కు చుట్టమా కేసీఆర్‌? ఎం‌తమందిని చంపుతారో చంపండి’ అంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్‌ అయ్యారు. ఖమ్మం నగరంలో ఆయనను హెచ్చరిస్తూ వెలసిన పోస్టర్లు వైరల్‌ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన మువ్వ విజయ్‌ ‌బాబు, చీకటి కార్తీక్‌ ‌లతో కలసి వి•డియాతో మాట్లాడుతూ…తనకు కానీ.. తన కార్యకర్తలకు కానీ ఏం జరిగినా కూడా సీఎం కేసీఆర్‌దే బాధ్యత వహించాలని అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌నేతల బెదిరింపులకు భయపడేది లేదన్నారు. తన కార్యకర్త ప్రతిఒక్కరినీ కాపాడుకుంటానన్నారు. తన కార్యకర్తలు, కాంగ్రెస్‌ ‌శ్రేణులు ఎవరూ భయపడవద్దన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా పోరాడుతానన్నారు. కొంతమంది అధికారులకు చెబుతున్నానని.. కావాలంటే వి•రు పింక్‌ ‌కలర్‌ ‌షర్ట్ ‌వేసుసుకోండని సూచించారు. కొంత మంది అధికారులు రేపు శిక్షకు గురికాక తప్పదని.. తాను న్యాయపోరాటం చేస్తానని.. ఈ తాటాకు చప్పుళ్ళకు భయపడలేదు లేదని పొంగులేటి స్పష్టం చేశారు.

కోమటిరెడ్డి పోస్టర్‌లో రేవంత్‌ ‌ఫోటో మాయం : మరోమారు బయటపడ్డ విభేదాలు
కాంగ్రెస్‌ ‌పార్టీలో నివురు గప్పిన నిప్పులా వివాదాలు ఉన్నాయని తరచూ బయటపడుతుంది. తాజాగా రాహుల్‌ ‌గాంధీ  ఖమ్మం బహిరంగసభలో పాల్గొనేందుకు రెండో తేదీన వొస్తున్న నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి కూడా ఇందు కోసం ప్రచారం చేస్తున్నారు. ఆయన తరపున సోషల్‌ ‌వి•డియాలోనూ ప్రచారం చేస్తున్నారు. ఇలా ఓ పోస్టర్‌ ‌ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అధికారిక ట్విట్టర్‌ ‌ఖాతాలో పోస్ట్ ‌చేశారు.

అయితే అందులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ఫోటో లేకపోవడం వివాదాస్పదం అవుతుంది. ఇటీవల పలు సందర్భాల్లో కోమటిరెడ్డి రేవంత్‌ ‌రెడ్డితో కలిసి కనిపించారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరికల అంశంపై మాట్లాడేందుకు రేవంత్‌ ‌రెడ్డి కూడా ఆయన ఇంటికి వెళ్లారు. అంతా బాగుందనుకుంటున్న సమయంలో పార్టీ పరంగా వేస్తున్న పోస్టర్లలో… టీ పీసీసీ చీఫ్‌ ‌ఫోటోను తీసేయడం వివాదాస్పదం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *